ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కబాలి' గురించి రాధికా ఆప్టే!

Wed, Jul 27, 2016
'కబాలి'లో రాధికా ఆప్టే - రజనీకాంత్
'కబాలి'లో రాధికా ఆప్టే - రజనీకాంత్
'కబాలి' సినిమాలో ఛాన్స్ కోసం మొదటిసారిగా తనకి దర్శకుడు రంజిత్ ఫోన్ చేసినప్పుడు, తను ఎంతమాత్రం నమ్మలేదని రాధికా ఆప్టే చెప్పింది. ఆ తరువాత చెన్నై వెళ్లి కథ వినేంతవరకూ, తనని ఎంపిక చేసుకుంటారని అస్సలు అనుకోలేదని అంది.

ఈ సినిమాలో తాను రజనీ భార్యగా .. టీనేజ్ అమ్మాయికి తల్లిగా నటించానని చెప్పింది. అయితే ఈ పాత్ర చేయవద్దని కొంతమంది తనకి చెప్పారనీ, అయినా తాను వినిపించుకోకుండా ఈ పాత్ర చేశానని అంది. ఇది రజనీకాంత్ సినిమా కావడం వలన .. ఇలాంటి అవకాశం అందరికీ రాదని తెలియడం వలన అంగీకరించానని అంది. రజనీకాంత్ వంటి గొప్ప వ్యక్తితో కలిసి నటించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)