ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తన పాత్రను తానే పోషించనున్న ముద్దుగుమ్మ

Wed, Jul 27, 2016
సన్నీ లియోన్
సన్నీ లియోన్
ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో బయోపిక్ ల (జీవిత కథలు) ట్రెండ్ ఎక్కువైంది. అలాంటి చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో హీరోలు, హీరోయిన్లు కూడా అలాంటి చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సెక్సీ స్టార్ సన్నీ లియోన్ బయోపిక్ ను కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే, ఇందులో సన్నీ పాత్రను ఆమె చేతే వేయించడానికి ఫిలిం మేకర్ అభిషేక్ వర్మ సంప్రదింపులు చేస్తున్నారు. అలాగే, సన్నీ భర్త డేనియల్ వెబర్ కూడా ఇందులో నటిస్తాడట. సన్నీ లియోన్ పూర్వాశ్రమంలో పోర్న్ సినిమాలలో (నీలి చిత్రాలు) నటించిన సంగతి మనకు తెలిసిందే. అలా ఆమె జీవితం సంచలనాలతో ముడిపడి ఉండడంతో ఈ చిత్రం పట్ల అప్పుడే బాలీవుడ్ లో క్యూరియాజిటీ నెలకొంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)