ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Wed, Jul 27, 2016
తమన్నా
తమన్నా
* మిల్కీ బ్యూటీ తమన్నా ద్విపాత్రాభినయం చేస్తున్న 'అభినేత్రి' చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. కాగా, ఈ చిత్రం విడుదల తేదీని నిర్మాతలు నిర్ణయించారు. సెప్టెంబర్ 9న దీనిని విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
* కామెడీ స్టార్ సునీల్ హీరోగా మన్నారా చోప్రా కథానాయికగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో రూపొందిన 'జక్కన్న' చిత్రం ఆడియోకు సంబంధించిన ప్లాటినం డిస్క్ వేడుక రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకలో తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ శుక్రవారం ఈ చిత్రం రిలీజవుతోంది.
* బాక్సాఫీసు వద్ద రజనీకాంత్ స్టామినాను మరోసారి నిరూపించిన 'కబాలి' చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. కాగా, ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన సన్నిహితుల కోసం త్వరలోనే చెన్నయ్ లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)