ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్లామర్ డోస్ పెంచిన లావణ్య

Tue, Jul 26, 2016
లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి
'భలే భలే మగాడివోయ్' .. 'సోగ్గాడే చిన్నినాయన' తరువాత లావణ్య త్రిపాఠి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాల తరువాత ఆమెకి అవకాశాలు వరుసబెట్టాయి. అలా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో 'శ్రీరస్తు శుభమస్తు' ఒకటి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి గ్లామర్ డోస్ పెంచినట్టుగా కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి.

ఈ రోజు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసిన తరువాత, ఆ వార్తలు నిజమేనని అనుకుంటున్నారు. లావణ్య నాజూకు అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. నటనకి గ్లామర్ డోస్ జత చేసింది కనుక, ఈ సినిమా తరువాత ఆమె మరింత బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)