ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది

Tue, Jul 26, 2016
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి 150వ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఒక వైపున ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైపోయింది. ఇప్పటికే ఈ సినిమా సీడెడ్ .. ఈస్ట్ గోదావరి జిల్లాల ఏరియా హక్కులకు సంబంధించిన డీల్స్ పూర్తయినట్టు చెబుతున్నారు.

వైజాగ్ ఏరియా హక్కుల విషయంలో గట్టి పోటీ వున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ రేటును చెల్లించి ఎవరు ఈ రైట్స్ ను దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 70 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగవచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత చరణ్ కావడంతో, ఎక్కువ రేటు చెల్లిచడానికి డిస్ట్రిబ్యూటర్లు వెనుకాడం లేదట. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)