ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు శిరీష్ మూవీ ఫంక్షన్ కి చిరూ!

Tue, Jul 26, 2016
చిరంజీవి
చిరంజీవి
అల్లు శిరీష్ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు క్రిష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన దృశ్యాలతో .. ఆకట్టుకునే మాటలతో ఈ ట్రైలర్ అలరిస్తోంది.

ఈ సినిమాను ఆగస్టు 5న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నెల 31న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నారు. ఈ సినిమాతో హిట్ దక్కడం ఖాయమనే నమ్మకంతో అల్లు శిరీష్ వున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)