ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కబాలి' ఫస్టు వీకెండ్ వసూళ్లు

Tue, Jul 26, 2016
'కబాలి'లో రజనీకాంత్
'కబాలి'లో రజనీకాంత్
రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన 'కబాలి' చిత్రం, ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్టు వీకెండ్ వసూళ్లు అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, ఫస్టు వీకెండులో 211.25 కోట్ల గ్రాస్ ను .. 125.02 కోట్ల షేర్ ను సాధించినట్టుగా తెలుస్తోంది.

మూడు రోజుల్లో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం కొత్త రికార్డ్ గా చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం కూడా షికారు చేస్తోంది. రజనీకాంత్ పారితోషికం కాకుండా, ఈ సినిమా కోసం ఖర్చు చేసిన మొత్తం 15 కోట్లు మాత్రమేనని అంటున్నారు. అదే నిజమైతే .. ఈ సినిమా ఒక రేంజ్ లో లాభాలు తెచ్చిపెట్టినట్టే!
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)