ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఇంకొక్కడు'కి హిట్ తప్పదట!

Tue, Jul 26, 2016
విక్రమ్
విక్రమ్
కోలీవుడ్ లో కొత్తదనానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇచ్చే సీనియర్ కథానాయకులలో విక్రమ్ ఒకరు. వైవిధ్యభరితమైన పాత్రల పట్ల ఆయన ఆసక్తిని చూపుతాడనటానికి శివపుత్రుడు .. అపరిచితుడు .. ఐ సినిమాలే నిదర్శనం. అలాంటి విక్రమ్ ఈసారి తమిళంలో 'ఇరుముగన్' గాను .. తెలుగులో 'ఇంకొక్కడు'గాను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆడియో వేడుకను, దక్షిణాది స్టార్ హీరోల సమక్షంలో ఆగస్టు 2న చెన్నై లో గ్రాండ్ గా జరపనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల సరైన హిట్ లేక నిరుత్సాహంగా వున్న విక్రమ్, ఈ సినిమా ఘన విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయమనే ఆశతో వున్నాడు. ఆయన ఆశ ఫలిస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)