ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్రసెల్స్ లో మన హీరోయిన్ల సందడి!

Tue, Jul 26, 2016
రెజీనా, నీరజ, రకుల్, సమంత
రెజీనా, నీరజ, రకుల్, సమంత
రెండు మూడు దశాబ్దాల నాటి హీరోయిన్లకు, ఇప్పటి హీరోయిన్లకు చాలా తేడా వుంది. అప్పట్లో ఒకే సెట్లో ఇద్దరు హీరోయిన్లు వున్నప్పటికీ, ఎడమొహం పెడమొహంగా... ఎవరికి వారు మూతులు ముడుచుకుని కూర్చునేవారు. అసలు సఖ్యత అనేదే వుండేది కాదు. ఇవాళ్టి హీరోయిన్లు అలా కాదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటూ మంచి రిలేషన్స్ కొనసాగిస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఫోటో. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా ఈ ముగ్గురూ కలసి ప్రస్తుతం బెల్జియంలోని బ్రసెల్స్ సిటీలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి హీరో నితిన్, డిజైనర్ నీరజ కోన కూడా జతకలిశారు.

అక్కడ 'టుమారో ల్యాండ్' పేరిట వరల్డ్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. దానిని స్వయంగా వీక్షించి, మ్యూజిక్ లోని కొంగ్రొత్త పోకడలను ఆస్వాదించాలన్న కోరికతో వీరంతా కలసి అక్కడికి వెళ్లడం జరిగింది. ఇది చివరి క్షణంలో ప్లాన్ చేసుకున్న ట్రిప్ అనీ, మొదట తాను, నితిన్ మరికొందరు కలసి బ్రసెల్స్ వెళ్లామని, ఆ తర్వాత సమంత, రకుల్, రెజీనా వచ్చి తమతో జాయిన్ అయ్యారని నీరజ కోన తెలిపింది. అందరం కలసి కొత్త మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తున్నామని ఆమె చెప్పింది. వీరంతా కలసి తిరిగి ఈ నెల 28న ఇండియాకు వస్తారట.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)