ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Jul 26, 2016
సమంత
సమంత
* 'ఎందులోనైనా విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి' అంటోంది చెన్నయ్ ప్రెట్టీ డాల్ సమంత. "సినిమాలే కాదు... ఎక్కడైనా సరే సక్సెస్ కొట్టాలంటే యుద్ధం చేయాల్సిందే. ఆ సందర్భంగా ఎన్నో కోల్పోతాం. అయితే, విజయం సాధించాక మాత్రం అన్నీ మరచిపోతాం. ఆ విజయం ముందు మనం కోల్పోయినవి చిన్నగా కనిపిస్తాయి. నా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ స్థాయికి రావడానికి ఎన్నో త్యాగాలు చేశాను. అయితే, ఈ సక్సెస్ ముందు అవన్నీ దిగదుడుపే" అని చెప్పింది ఈ అందాలతార.
* తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'పెళ్లి చూపులు' చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, తొలిసారిగా ఈ రోజు నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో ఈ చిత్రం ప్రీమియర్ షోను వేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ ఇందులో జంటగా నటించారు.
* గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఇందులో హీరోయిన్లుగా హన్సిక, కేథరిన్ త్రెసాలను ఎంపిక చేసినట్టు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. షూటింగ్ షెడ్యూల్స్ ను త్వరలో తెలుపుతామని చెప్పారు.
* నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం షూటింగును పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకను త్వరలో నిర్వహిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)