ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేరళకి 'జనతా గ్యారేజ్'

Mon, Jul 25, 2016
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూ ల్ ని కేరళలో ప్లాన్ చేశారు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకూ అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొరటాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికలుగా సమంతా .. నిత్యామీనన్ నటిస్తున్నారు. ఒక ముఖ్యమైన పాత్రను మోహన్ లాల్ ధరిస్తుండగా, విలన్ పాత్రను ఉన్నిముకుందన్ పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్న ఈ సినిమా, అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)