ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అర్జున్ వచ్చేవరకు నటిస్తానంటున్న వెంకీ!

Mon, Jul 25, 2016
వెంకటేశ్
వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ తన కెరీర్ గురించి నిన్న రాత్రి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తన తనయుడు అర్జున్ ఎంట్రీ ఇచ్చేవరకు తాను సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెప్పారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన 'బాబు బంగారం' చిత్రం ఆడియో వేడుకలో వెంకీ మాట్లాడుతూ, "నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 30 ఏళ్లు ఎలా గడిచిపోయాయా అనిపిస్తోంది. అసలు గత ఐదేళ్ల నుంచీ సినిమాలు కాస్త తగ్గిద్దామనుకున్నాను. అయితే, 'బాబు బంగారం' చూశాక మరో పదిహేనేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్టు అనిపించింది. అందుకే, మారుతితో, మరో పదిహేనేళ్ల వరకు ఎక్స్ పయిరీ డేట్ ఇచ్చావేంటయ్యా? అన్నాను. మళ్లీ కొత్త ఉత్సాహం వస్తోంది. మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకు ఇక నటిస్తూనే వుంటాను" అన్నారు.
ఇక ఈ సినిమా తర్వాత తనని 'పెళ్లికాని ప్రసాద్' అంటారో, లేక 'బాబు బంగారం' అని పిలుస్తారో మీ ఇష్టం... అంటూ ప్రేక్షకులను ఉత్సాహపరచారు వెంకటేశ్.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)