ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్య మనసు మార్చుకుంటాడా?

Sun, Jul 24, 2016
సూర్య
సూర్య
రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన 'కబాలి' సినిమా, ఫస్టులుక్ నుంచే భారీ అంచనాలను పెంచేసింది. రజనీకాంత్ గెటప్ చూసి 'అదుర్స్' అనని వాళ్లు లేరు. దాంతో ఈ సినిమా దర్శకుడు రంజిత్ తో తమ సినిమా చేయాలని చాలామంది కోలీవుడ్ కథానాయకులు ఉత్సాహాన్ని చూపించారు. వాళ్లందరిలో సూర్య ముందుంటూ వచ్చాడు.

రంజిత్ కూడా సూర్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనే భావించాడు. అందుకోసం ఆయన రెండు కథలను కూడా సిద్ధం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే 'కబాలి' చూసిన సూర్య, దర్శకుడిగా రంజిత్ కి నూటికి నూరు మార్కులు ఇవ్వలేకపోయాడట. ఇప్పటివరకూ రంజిత్ రెడీ చేసిన రెండు కథల్లో ఏ కథను ఎంచుకోవాలా అని ఆలోచించిన సూర్య, ఇప్పుడు అసలు రంజిత్ తో చేయాలా వద్దా? అని ఆలోచించే పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)