ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ మెగాస్టార్ తో 'కబాలి' రీమేక్?

Sun, Jul 24, 2016
అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్
ఎన్నో అంచనాలతో... సంచలనాలతో... ప్రత్యేకతలతో విడుదలైన రజనీకాంత్ చిత్రం 'కబాలి' పట్ల టాక్ ఎలా ఉన్నప్పటికీ, బాక్సాఫీసు వద్ద మాత్రం ఈ చిత్రం దూసుకుపోతోంది. గత రికార్డులను తుడిచిపెట్టేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను చూరగొంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు వార్తలొస్తున్నాయి. రజనీ పోషించిన పాత్రను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేత చేయించడానికి ఆయనను సంప్రదిస్తున్నారు. ఇందుకు ఆయన కూడా సుముఖంగానే వున్నట్టు సమాచారం. రజనీ నటించిన 'కబాలి' చిత్రం తమిళ వాతావరణంతో రూపొందిన కథ కాబట్టి, హిందీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారట.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)