ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విక్రం కోసం చెన్నయ్ వెళుతున్న చరణ్!

Sun, Jul 24, 2016
రామ్ చరణ్
రామ్ చరణ్
ప్రస్తుతం 'ధ్రువ' చిత్రం షూటింగులో బిజీగా వున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ తమిళ సినిమా ఆడియో వేడుకకు చీఫ్ గెస్టుగా హాజరుకానున్నాడు. ప్రముఖ తమిళ నటుడు విక్రం హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇరు ముగన్' (తెలుగులో దీనిని 'ఇంకొక్కడు' పేరిట డబ్ చేస్తున్నారు) చిత్రం ఆడియో వేడుకను ఆగస్టు 2న చెన్నయ్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రావలసిందిగా చరణ్ ను ఆ యూనిట్ కోరడం జరిగిందని, దీనికి చరణ్ వెంటనే అంగీకరించాడని తాజా సమాచారం. తాను షూటింగులో బిజీగా వున్నప్పటికీ చెన్నయ్ వెళ్లి వేడుకలో పాల్గొనడానికి చరణ్ అంగీకరించడం విశేషం. తెలుగు, తమిళ నటుల మధ్య వున్న సత్సంబంధాలకు ఇది దర్పణం పడుతుంది.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)