ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ సినిమా మొదలయ్యేది ఆ రోజునే!

Sat, Jul 23, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ తదుపరి సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొదలు కావలసింది. అయితే హఠాత్తుగా దర్శకుడు మారడంతో ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ పై దర్శకుడు 'డాలీ' కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు షికారు చేస్తుండటంతో, ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే విషయంలో అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు 6న మొదలు పెట్టాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఆ దిశగా సన్నాహాలు జరిగిపోతున్నాయని అంటున్నారు. అదే నిజమైతే పవన్ అభిమానులకు అంతకి మించిన ఆనందం మరొకటి లేదు. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)