ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జక్కన్న' గురించి మన్నారా చోప్రా

Sat, Jul 23, 2016
మన్నారా చోప్రా
మన్నారా చోప్రా
సునీల్ కథానాయకుడిగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో 'జక్కన్న' చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మన్నారా చోప్రా మాట్లాడుతూ, ఈ సినిమాలో తన పాత్ర సహజత్వానికి దగ్గరగా .. బబ్లీగా ఉంటుందని చెప్పింది. ఈ పాత్ర తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అంది.

సునీల్ కామెడీ టైమింగ్ .. ఆయన డాన్స్ చేసే తీరు చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పింది. తన పాత్ర మంచిగా రావడానికి ఆయన ఎంతగానో సహకరించారని అంది. దర్శకుడు అన్ని పాత్రలను అద్భుతంగా మలిచాడనీ .. ప్రతి పాత్ర ప్రతి ఒక్కరికి చేరువవుతుందని చెప్పింది. కథ కథనాలు .. డాన్సులు .. సంభాషణలు ప్రధానమైన బలంగా ఈ సినిమాను ముందుకు నడిపిస్తాయని అంది. ఈ సినిమాను అంతా ఆదరిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)