ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనుష్క సినిమాలో టబు!

Sat, Jul 23, 2016
టబు
టబు
తెలుగు తెరపై కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేసే సామర్ధ్యం కలిగిన వారిలో అనుష్క ముందు వరుసలో కనిపిస్తుంది. గతంలో 'అరుంధతి' .. ఈ మధ్య 'రుద్రమదేవి' చేసిన అనుష్క, ప్రస్తుతం 'భాగమతి' సినిమా చేస్తోంది. అశోక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఇప్పటికే మలయాళ భాష నుంచి కథానాయకుడిగా ఉన్ని ముకుందన్ ను .. ప్రతినాయకుడిగా జైరామ్ ను ఎంపిక చేశారు.

ఇక ఒక కీలకమైన పాత్ర కోసం 'టబు'ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఇటీవల బాలీవుడ్లో 'దృశ్యం' రీమేక్ లో చేసిన టబు, ఆ తరువాత నుంచి పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తూ వస్తోంది. ఈ సినిమాలో పాత్ర నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అయితే ఆ పాత్ర ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)