ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవర్ ఫుల్ పాత్రలో మంచు లక్ష్మి

Sat, Jul 23, 2016
మంచు లక్ష్మి
మంచు లక్ష్మి
మంచు లక్ష్మి ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ .. ప్రేక్షకుల మెప్పును పొందుతూ తన కెరియర్ ను కొనసాగిస్తోంది. అలా ఆమె ప్రస్తుతం 'లక్ష్మీ బాంబ్' చిత్రంలో నటిస్తోంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని చెప్పారు.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నామని అన్నారు. రెండు భారీ ఫైట్స్ ను .. రెండు పాటలను చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ సినిమాలో జడ్జి గా పవర్ ఫుల్ పాత్రలో మంచు లక్ష్మి నటిస్తోందనీ .. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అన్నారు. కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలాఖరు వరకు జరుగుతుందనీ, సాధ్యమైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)