ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళ దర్శకుడితో పవన్?

Sat, Jul 23, 2016
పవన్
పవన్
ఇటీవలి కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో ఎక్కువ గ్యాప్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. సరైన సబ్జెక్ట్ సెట్ కాకపోవడంతో ఈ గ్యాప్ కంటిన్యూ అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పవన్ ఇప్పుడు ఆ గ్యాప్ ను తగ్గించుకునే క్రమంలో వరుసగా చిత్రాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న పవర్ స్టార్, దీని తర్వాత చేయనున్న చిత్రాన్ని కూడా ఓకే చేసుకునే పనిలో వున్నారు.

అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమా కథ పట్ల ఆయన మక్కువ చూపుతున్నట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ రీమేక్ ను చేయడానికి పవన్ తో సంప్రదింపులు చేస్తున్నారు. మరోపక్క పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆ చిత్రం కథకు కాస్త మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే, ఈ రీమేక్ కు తమిళ దర్శకుడు ఆర్.టి.నేసన్ దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. ఆ యువ దర్శకుడి శైలి పట్ల పవన్ ఆసక్తి చూపుతున్నారట. ఆమధ్య విజయ్, మోహన్ లాల్ ల కాంబినేషన్లో ఈయన 'జిల్లా' చిత్రాన్ని రూపొందించాడు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)