ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, Jul 23, 2016
తమన్నా
తమన్నా
* మంచి మాస్ ట్యూన్స్ తో ఐటెం పాటలను రూపొందించడంలో ప్రత్యేకతను చాటుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, తాజాగా 'జనతా గ్యారేజ్' చిత్రం కోసం మరో సూపర్ ఐటెం నెంబర్ ఇచ్చాడట. ఇది ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా వుందని అంటున్నారు. త్వరలో ఎన్టీఆర్, తమన్నాలపై దీనిని సెట్స్ లో చిత్రీకరిస్తారు.
* తెలుగు చలన చిత్ర మండలి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఎన్నికయ్యారు. నిన్న విజయవాడలో ఈ ఎన్నికలను నిర్వహించగా, పి.కిరణ్ పై కల్యాణ్ విజయం సాధించారు. 45 మంది కార్యవర్గ సభ్యులు ఈ ఎన్నికలో ఓటింగ్ చేయగా, కల్యాణ్ కు 26, కిరణ్ కు 19 ఓట్లు వచ్చాయి.
* యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం తమిళ దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాదులో ఈ చిత్రం క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో అవికా గోర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)