ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భర్తతో కథానాయికకు మనస్పర్థలు?

Fri, Jul 22, 2016
అమలాపాల్
అమలాపాల్
డస్కీ బ్యూటీ అమలాపాల్ వైవాహిక జీవితంలో కలతలు వచ్చినట్టుగా కోలీవుడ్ లో ఒక్కసారిగా వార్తలు గుప్పుమంటున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన అమలాపాల్ రెండేళ్ల క్రితం తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి మనకు తెలిసిందే. పెళ్లయ్యాక కూడా అమల సినిమాల్లో నటిస్తూనే వుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనే వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే, ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్యా మనస్పర్థలు తలెత్తాయని, అవి చాలా దూరం వరకూ వెళ్లాయని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. గత రెండు నెలలుగా వీరిద్దరూ కలసి బయట ఎక్కడా కనిపించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఏమైనా, ఈ విషయంపై వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుంది.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)