ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్

Fri, Jul 22, 2016
రాజశేఖర్
రాజశేఖర్
కథానాయకుడిగా వరుస పరాజయాలు ఎదురుకావడంతో, రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. తేజ దర్శకత్వంలో ఆయన 'అహం' సినిమా చేయనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆయన ఆ సినిమా నుంచి తప్పుకున్నాడనే టాక్ వినిపించింది.

ఇక ఆయనతో ప్రవీణ్ సత్తారు ఒక సినిమా ప్లాన్ చేశాడనీ .. ఇందులో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని చెప్పుకున్నారు. ఈ సినిమా 'డై హార్డ్' అనే హాలీవుడ్ మూవీకి ఫ్రీ మేక్ అని తెలుస్తోంది. ఆ సినిమాలో నటించిన 'బ్రూస్ విల్లీస్' పాత్రను పోలి రాజశేఖర్ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు రాజశేఖర్ కి ఏ రేంజ్ క్రేజ్ ను తెచ్చిపెట్టాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలా ఈ సినిమా ఆయనకి పూర్వ వైభవాన్ని తెస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)