ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాని కొత్త సినిమా త్వరలోనే ప్రారంభం

Fri, Jul 22, 2016
నాని
నాని
వరుస సినిమాలతో .. సక్సెస్ లతో నాని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఆయన దర్శకుడు విరించి వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో దర్శకుడిగా విరించి వర్మ తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమా చేస్తోన్న నాని, త్రినాథరావు చెప్పిన కథకి కూడా ఓకే చెప్పేశాడు.

దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఆగస్టు 15న ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్రినాథరావు సిద్ధం చేసిన కథ వైవిధ్యభరితమైనదనీ, అందుకే వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)