ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అరగంటలో పాటపాడేసిన హీరో!

Fri, Jul 22, 2016
తమన్ - ధనుష్
తమన్ - ధనుష్
కోలీవుడ్ మాస్ ఆడియన్స్ లో ధనుష్ కి మంచి క్రేజ్ వుంది. సహజమైన నటనను కనబరిచే ఆయనకి తెలుగులోను చాలామంది ఫ్యాన్స్ వున్నారు. ధనుష్ కి నటనపైనే కాదు .. కథ .. స్క్రీన్ ప్లే పైన .. సంగీతం పైన మంచి అవగాహన ఉంది. పాటలు కూడా బాగా పాడతాడు. అందువల్లనే ఆయనతో తమన్ ఒక పాట పాడించాడు.

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా 'తిక్క' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తమన్ ఈ సినిమాలోని ఒక పాటను ధనుష్ తో పాడించాడు. 'తిక్క బేబీ' అనే ఈ పాటను ధనుష్ ముందుగానే ప్రిపేర్ కావడం వలన, రికార్డింగ్ ను అరగంటలో పూర్తిచేశారట. ఈ ఆల్బంలో ఈ పాట హైలైట్ గా నిలుస్తుందనీ, 'కొలవెరి' సాంగ్ మాదిరిగానే పాప్యులర్ అవుతుందని టీమ్ భావిస్తోంది. ఈ నెల 30న ఆడియోను .. వచ్చే నెల 13న సినిమాను విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)