ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మేకప్ కి 6 గంటలు పట్టిందట!

Fri, Jul 22, 2016
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్
శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' సినిమా తెరకెక్కుతోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఆయన గెటప్ కి సంబంధించిన ఒక స్టిల్ బయటికి వచ్చింది. అది చూసి, ఈ సినిమాలో ఒక పిచ్చి సైంటిస్ట్ పాత్రలో కాకి గెటప్ ను పోలిన ఆహార్యంతో ఆయన కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.

ఈ విషయం అక్షయ్ కుమార్ దగ్గర ప్రస్తావిస్తే ఆయన పెద్దగా నవ్వేశాడు. ఈ వార్త తనకి కొత్తగా అనిపిస్తోందని ఆయన అన్నాడు. ఆ గెటప్ లో తాను ఒక హోటల్ కి వెళ్లగా ఎవరూ తనని విచిత్రంగా చూడలేదని .. కాకపోతే గుర్తుపట్టలేదని అక్షయ్ కుమార్ చెప్పాడు. ఈ పాత్ర కోసం తనకి మేకప్ వేయడానికి 6 గంటలు పట్టేదని అన్నాడు. తన పాత్ర కొత్తగా .. ఊహించలేని విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)