ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిట్ కాంబినేషన్ మళ్లీ రెడీ!

Fri, Jul 22, 2016
విజయ్
విజయ్
తమిళ అగ్రకథానాయకుడిగా విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య ఆయన నటించిన 'తెరి' చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వసూళ్ల విషయంలో రికార్డులు తిరగరాసింది. ఈ క్రమంలో త్వరలోనే ఈ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.

అట్లీ కుమార్ ఒక కథను సిద్ధం చేశాడని, ఈ కథను ఆయన విజయ్ తో గానీ .. సూర్యతో గాని తెరకెక్కించవచ్చనే వార్తలు ఇటీవల షికారు చేశాయి. ఇక ఆయన విజయ్ తోనే ఆ కథను తెరకెక్కించనున్నాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం తన 60వ చిత్రం పనుల్లో విజయ్ బిజీగా వున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తికాగానే, అట్లీ కుమార్ తో కలిసి విజయ్ సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. 'తెరి' సినిమాను నిర్మించిన కళైపులి థానుయే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)