ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందానికి, ఆరోగ్యానికి లింకు పెట్టిన అనుష్క

Fri, Jul 22, 2016
అనుష్క
అనుష్క
తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికల జాబితాలో అనుష్క కనిపిస్తుంది. విభిన్నమైన కథా చిత్రాలను చేస్తూ, ఆమె తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తోంది. అలాంటి అనుష్క దగ్గర అందం గురించిన ప్రస్తావన తెచ్చినప్పుడు, ఆమె తనదైన శైలిలో స్పందించింది. అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుందని ఆమె చెప్పింది. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో అందంగా కనిపిస్తూ ఉంటారని అంది.

ఆరోగ్యంగా .. ఆనందంగా వున్నప్పుడే అందంగా కనిపించడం సాధ్యమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆరోగ్యంగా లేనప్పుడు అందంగా కనిపించడానికి చేసే ప్రయత్నం వలన ప్రయోజనం ఉండదని చెప్పింది. తాను అందంగా ఉంటానని చాలామంది అంటూ ఉంటారనీ, తనకంటే అందమైన వాళ్లని ఎంతోమందిని రోజూ చూస్తూనే ఉంటానని చెప్పింది. అయితే నటిగా తనకి అవకాశాలు .. గుర్తింపు లభిస్తుండటం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)