ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆలోచనలో పడిన అందాల సురభి

Fri, Jul 22, 2016
సురభి
సురభి
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో సురభి ఒకరు. 'బీరువా' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఈ సుందరి, యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. గ్లామర్ పుష్కలంగా వున్న ఈ అమ్మడు 'ఎక్స్ ప్రెస్ రాజా' .. 'జెంటిల్ మెన్' చిత్రాల్లో నటించి మెప్పించింది. దాంతో వరుస అవకాశాలు అమ్మడిని వెతుక్కుంటూ రావడం ఖాయమని చాలామంది అనుకున్నారు.

కానీ అనుకున్న స్థాయిలో సురభికి ఛాన్సులు రావడం లేదు. దాంతో ఆలోచనలో పడిన సురభి, ఫోటో షూట్ లు పెడుతోంది. అందం .. అవసరమైనంత నటన తెలిసిన సురభికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి కారణం, లౌక్యం తెలియకపోవడమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)