ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మూవీని తానే వదులుకుందట!

Fri, Jul 22, 2016
పరిణీతి చోప్రా
పరిణీతి చోప్రా
మహేశ్ .. మురుగదాస్ కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా పరిణీతి చోప్రాను తీసుకున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. పరిణీతి పారితోషికంగా మూడున్నర కోట్లు అడగడంతో, ఆమెకి బదులుగా రకుల్ ను ఎంపిక చేసినట్టుగా ఇటీవల వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ విషయం పట్ల పరిణీతి స్పందించింది. ఈ సినిమా కోసం తనని సంప్రదించిన మాట వాస్తవమేనని ఆమె చెప్పింది. అయితే తాను కాల్షీట్స్ చూసుకుని చెబుతానని అన్నాననీ, ఈ లోగానే తాను ఈ సినిమా చేస్తున్నట్టుగా ప్రచారం జరిగిపోయిందని అంది. ఈ సినిమా నుంచి తనని తప్పించారనే వార్తలో నిజం లేదనీ, కాల్షీట్స్ కుదరక తానే ఈ సినిమాను వదులుకున్నానని ఆమె స్పష్టం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)