ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ తో తమన్నా స్పెషల్ సాంగ్

Fri, Jul 22, 2016
తమన్నా
తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా 'జనతా గ్యారేజ్' టీమ్ లో చేరుతోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు విశేషాలతో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ క్రమంలో ఇందులో తమన్నా ఓ స్పెషల్ సాంగులో నర్తించనుందని సమాచారం. ఇందులో ప్రీ క్లైమాక్స్ సందర్భంలో ఓ ఐటెం పాట వుందని, దానిని స్టార్ హీరోయిన్ చేత చేయిస్తే బాగుంటుందని యూనిట్ భావించిందట.
దాంతో తమన్నాను కాంటాక్ట్ చేయడం, అందుకు ఆమె అంగీకరించడం జరిగిపోయినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిన్నది గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. వరస చూస్తే అమ్మడు త్వరలో ఇలా స్పెషల్ సాంగ్సుతో ప్రేక్షకులను మురిపించేలా కనిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)