ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

80 కోట్లతో కొరటాల నెక్స్ట్ మూవీ?

Thu, Jul 21, 2016
కొరటాల శివ
కొరటాల శివ
కొరటాల శివ ప్రస్తుతం 'జనతా గ్యారేజ్' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చరణ్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. కానీ కొరటాలతో చేయాలని మహేశ్ ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉండటంతో, ఆయన మహేశ్ తో చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ఈ సినిమాను 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాకి దర్శకుడు .. కథానాయకుడు సహా మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల పారితోషికాలు కలుపుకుంటే 40 కోట్ల వరకూ ఖర్చు వస్తోందట. మరో 40 కోట్లు కథకి దృశ్యరూపాన్ని ఇవ్వడానికి ఖర్చు అవుతాయని భావిస్తున్నారట. అలా ఈ సినిమా 80 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)