ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీ షెడ్యూల్లో 'మిస్టర్'

Thu, Jul 21, 2016
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్
శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ 'మిస్టర్' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వలన ఈ సినిమా కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజులుగా స్పెయిన్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకూ అక్కడే ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది.

'బ్రూస్ లీ' పరాజయం తరువాత కొంత గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్ల, ఈ సినిమా కోసం విభిన్నమైన కథను రెడీ చేసుకున్నాడు. తన మార్క్ అనిపించేలా అన్ని అంశాలను మేళవించి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని సెట్స్ పైకి వెళ్లాడు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఆయన వున్నాడు. ఠాగూర్ మధు .. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తోన్న ఈ సినిమాలో, వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి - హెబ్బా పటేల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)