ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శిరీష్ విషయంలోను అదే పద్ధతి!

Thu, Jul 21, 2016
'శ్రీరస్తు శుభమస్తు'లో  అల్లు శిరీష్
'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్
సాధారణంగా ప్రతి సినిమా రిలీజ్ కి ముందుగా ఆడియో వేడుకను నిర్వహిస్తుంటారు. అప్పటి నుంచే ఆ పాటలు జనంలోకి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అవి పాప్యులర్ అయిన తరువాత ఆ సంతోషంతో ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా ఆడియో నుంచి సోషల్ మీడియా ద్వారా ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ వెళ్లి, ఆ తరువాత ఆడియో వేడుకను నిర్వహించాలని అల్లు అరవింద్ ఆలోచన చేస్తున్నారట.

అందులో భాగంగానే ఇటీవల వీడియోతో సహా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. గతంలో 'సరైనోడు' సినిమా నుంచే అల్లు అరవింద్ ఈ పద్ధతికి తెరతీశారు. ఈ విధంగా చేయడం వలన ఆడియో రెస్పాన్స్ విషయంలోను .. సినిమాపై ఆసక్తిని పెంచే విషయంలోను మంచి ఫలితం కనిపించింది. అందువలన అల్లు శిరీష్ తాజా సినిమాకి కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)