ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీకి పంచ్ డైలాగులు రెడీ!

Thu, Jul 21, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
స్టార్ హీరోల సినిమాలు అనగానే డైలాగులకు చాలా ప్రాధాన్యత వుంటుంది. అందులోనూ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ వున్న హీరోల విషయంలో అయితే మరింత జాగ్రత్త తీసుకోవాలి. హీరో చేత పంచ్ డైలాగులు చెప్పిస్తే, అభిమానుల కేరింతలతో థియేటర్ హోరెత్తిపోతుంది. ఈ విషయం దర్శకుడు హరీష్ శంకర్ కు బాగా తెలుసు. అందుకే, ఆ విషయంలో ఆయన ప్రత్యేకమైన కేర్ తీసుకుంటాడు. ఆ హీరోకున్న ఇమేజ్ ను బట్టి ఆ తరహా డైలాగులు రాసుకుంటాడు. ఇప్పుడు తాను స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిస్తున్న చిత్రానికి కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఈ ప్రాజక్టుకు సంబంధించి ప్రస్తుతం ఆయన డైలాగులు రాసుకునే పనిమీద వున్నాడు. బన్నీ చేత తనదైన శైలి పంచ్ డైలాగులు చెప్పించే క్రమంలో వాటికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం త్వరలో సెట్స్ కి వెళుతుంది.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)