ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శ్రీరస్తు శుభమస్తు' టైటిల్ సాంగ్ వచ్చేసింది!

Wed, Jul 20, 2016
'శ్రీరస్తు శుభమస్తులో 'అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి
'శ్రీరస్తు శుభమస్తులో 'అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి
అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి జంటగా 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ కి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ముందుగా చెప్పినట్టు ఈ సినిమా టైటిల్ సాంగ్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు.

అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠిపై చిత్రీకరించిన ఈ సాంగ్ చక్కని ఫీల్ తో ఆకట్టుకునేదిలా వుంది. సంగీత .. సాహిత్యాలు .. చిత్రీకరణ మనసుకు పట్టుకునేలా వున్నాయి. గతంలో కంటే శిరీష్ మంచి లుక్ తో కనిపిస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)