ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిహారికకి చిరూ సినిమాలో చేయాలనుందట!

Wed, Jul 20, 2016
నిహారిక
నిహారిక
'ఒక మనసు' సినిమా ద్వారా కథానాయికగా నిహారిక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. త్వరలో ఆమె ఒక రీమేక్ లో నటించనుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మెగా హీరోల సినిమాల్లోను ముఖ్యమైన పాత్రల్లో కనిపించి, మరింత క్రేజ్ ను సొంతం చేసుకోవాలని ఆమె భావిస్తోందట. అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు. ఇక చిరంజీవి 150వ సినిమాలో ఏదైనా చిన్న పాత్రయినా పోషించాలని ఆమె ఆసక్తి చూపుతోందని చెబుతున్నారు. ఈ విషయంపై తండ్రిపై కూడా ఆమె ఒత్తిడి తెస్తోందని అంటున్నారు. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)