ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్య ఏ కథను ఎంచుకుంటాడో!

Wed, Jul 20, 2016
సూర్య
సూర్య
సూర్య 'సింగం 3' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తికానుంది. ఆ తరువాత సినిమాను ఆయన రంజిత్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'కబాలి' కంటే ముందే సూర్యతో చేయాలని రంజిత్ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆయనకి రజనీకాంత్ తో చేసే ఛాన్స్ వచ్చింది.

ముందు ఆ సినిమాను చేయడమే మంచిదని సూర్య కూడా రంజిత్ ను ప్రోత్సహించాడు. 'కబాలి' ఈ నెల 22న రిలీజ్ కాగానే, సూర్య సినిమాపై రంజిత్ దృష్టి పెట్టనున్నాడు. సూర్య కోసం రంజిత్ రెండు కథలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒకటి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కాన్సెప్ట్ కాగా, మరొకటి బ్యాంకింగ్ కి సంబంధించినది. ఈ రెండూ బాగానే ఉంటాయట .. అయితే వీటిలో సూర్య దేనికి ఓకే చెబుతాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)