ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హన్సికపై నిర్మాత ఆరోపణ!

Wed, Jul 20, 2016
హన్సిక
హన్సిక
హన్సిక కథానాయికగా నిర్మాత పీటీ సెల్వకుమార్ ఇటీవల 'పోకిరిరాజా' చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా అక్కడ భారీ పరాజయాన్ని చవిచూసింది. కాగా, విడుదలకి ముందు ఈ సినిమా ఆడియో వేడుకను తమిళనాడులోని 'కోవై'లో నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి హన్సికను ఆహ్వానించారు. ఆమె తప్పకుండా వస్తానని చెప్పడంతో, వసతి సౌకర్యాల కోసం లక్షల్లో ఖర్చు చేశారట.

హన్సిక వస్తుందని భారీగా ప్రచారం కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో ఆమె హ్యాండ్ ఇచ్చిందని నిర్మాత ఆరోపించాడు. హన్సిక రాక కోసం తాము ఖర్చు చేసిన మొత్తం, ఆమె తిరిగి చెల్లించవలసిందేనని నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశానని ఆయన అన్నాడు. అయినా ఆమె స్పందించకపోవడం దారుణమని, అందువల్లనే ఆమెపై కేసు పెట్టే ఆలోచనలో వున్నానని ఆయన చెప్పాడు. మరి ఇప్పుడైనా హన్సిక స్పందిస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)