ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Wed, Jul 20, 2016
ఎమీ జాక్సన్
ఎమీ జాక్సన్
* తాను ఒక తెలుగు సినిమాకు సంతకం చేశానని బ్రిటిష్ బ్యూటీ ఎమీ జాక్సన్ చెప్పింది. ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న 'రోబో 2' పూర్తయ్యాక ఈ తెలుగు సినిమా మొదలవుతుందని ఈ చిన్నది తెలిపింది. అయితే, ఆ చిత్రం వివరాలను మాత్రం సస్పెన్స్ లో ఉంచింది.
* చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన 'మనమంతా' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికెట్ లభించింది. మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 5న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
* 'సంతోషం' సినీ వారపత్రిక తన పద్నాలుగవ వార్షికోత్సవాలను ఆగస్టు 14న జరుపుకుంటోంది. ఈ సందర్బంగా 'సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డుల' వేడుకను హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో ఆ రోజు సాయంకాలం ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు పబ్లిషర్ సురేష్ కొండేటి తెలిపారు.
* ప్రభాకర్ జైని దర్శకత్వంలో రూపొందిన 'క్యాంపస్ అంపశయ్య' చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. 'అంపశయ్య' నవల ఆధారంగా దీనిని రూపొందించారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)