ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగ్ ను పెళ్లిచేసుకోమని సుమలతతో అన్నారట!

Tue, Jul 19, 2016
సుమలత
సుమలత
నాగార్జున .. అమలను పెళ్లి చేసుకోవడానికంటే ముందు, రామానాయుడు కూతురు లక్ష్మి (నాగచైతన్య తల్లి)ని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ రెండు పెళ్లిళ్ల కంటే ముందుగా ఒక సంఘటన జరిగిందని, ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నటి సుమలత చెప్పింది.

ఒకసారి షూటింగ్ సమయంలో అక్కినేని .. సుమలతను దగ్గరికి పిలిచి, నీ హైటుకి .. కలర్ కి తగిన కుర్రాడు విదేశాల నుంచి వస్తున్నాడనీ .. అతనిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగారట. అంతే కాకుండా ఆమె ఓకే అంటే ఆమె తల్లితో మాట్లాడతానని అన్నారట. ''ఇంతకీ ఆ అబ్బాయి ఎవరండీ?'' అని సుమలత అడిగితే, 'ఇంకెవరూ .. మా అబ్బాయి నాగార్జున' అన్నారట. ఇలా అప్పట్లో జరిగిన ఒక సంఘటనను ప్రేక్షకుల సమక్షంలో సుమలత జ్ఞాపకం చేసుకున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)