ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ కొత్త లుక్ తో కనిపిస్తాడట!

Tue, Jul 19, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
ఈ మధ్య కాలంలో కథానాయకులంతా కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఒక్కో సినిమాకి ఒక్కో లుక్ మార్చేస్తూ అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా బన్నీ కూడా తన ప్రతి సినిమాకి కథ కథనాలపై ఎంత శ్రద్ధ పెడుతూ వస్తున్నాడో, లుక్ పై కూడా అంతే శ్రద్ధ పెడుతూ వస్తున్నాడు.

సన్నాఫ్ సత్యమూర్తి .. రుద్రమదేవి .. సరైనోడు సినిమాల్లోని బన్నీ పాత్రలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక హరీష్ శంకర్ తో చేయనున్న తన తదుపరి సినిమాలోను, ఆయన కొత్త లుక్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన పూర్తి గెడ్డంతో కనిపిస్తాడని అంటున్నారు. కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోందనీ, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)