ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా పవన్ కల్యాణ్

Tue, Jul 19, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో పవన్ నిమగ్నమై వున్నాడని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ గతంలోను తన సినిమాలకి స్వయంగా స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాడు. అయితే అలా ఆయన స్క్రిప్ట్ వర్క్ చేసిన సినిమాలు, ఆడియన్స్ ను అంతగా అలరించలేకపోయాయి.

గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా ఆయన స్క్రిప్ట్ వర్క్ ను చేస్తున్నట్టుగా చెబుతున్నారు. వైవిద్యభరితమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో, పవన్ విభిన్నమైన లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక శ్రుతిహాసన్ అనే వార్తలు గతంలో వచ్చాయి. కానీ, ఆమె ఇచ్చిన డేట్స్ మారడం వలన, ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. త్వరలోనే స్పష్టమైన సమాచారం తెలిసే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)