ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్'పై దిల్ రాజు నమ్మకం!

Tue, Jul 19, 2016
దిల్ రాజు
దిల్ రాజు
యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలను .. ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యే సినిమాల హక్కులను సొంతం చేసుకునే విషయంలో దిల్ రాజు ఎప్పుడూ ముందే వుంటారు. సినిమాల విషయంలో ఆయన జడ్జిమెంట్ దాదాపుగా తప్పదనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. అలాంటి దిల్ రాజు ఒక సినిమా రైట్స్ తీసుకున్నాడనగానే, ఆ సినిమా బిజినెస్ మరింతగా పెరిగిపోతుంది. 'జనతా గ్యారేజ్' సినిమా విషయంలోను అదే జరుగుతోంది.

ఈ సినిమా నైజామ్ ఏరియా రైట్స్ ను దిల్ రాజు 17 కోట్లకు దక్కించుకున్నట్టు చెబుతున్నారు. 'నాన్నకు ప్రేమతో' కన్నా 3 కోట్లు అధికంగా చెల్లించి ఆయన ఈ సినిమా రైట్స్ తీసుకోవడం విశేషం. నైజామ్ ఏరియా రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడవటం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. కొరటాల కథా కథనాలపై .. ఎన్టీఆర్ క్రేజ్ పై నమ్మకంతోనే దిల్ రాజ్ భారీ రేటు చెల్లించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)