ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పాటల చిత్రీకరణకు రెడీగా 'ధ్రువ'

Tue, Jul 19, 2016
చరణ్
చరణ్
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చరణ్ కథానాయకుడిగా 'ధ్రువ' చిత్రం రూపొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోందని చెప్పారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కొన్ని కీలకమైన దృశ్యాలను చిత్రీకరిస్తున్నాడని అన్నారు. ఆయన స్టైలీష్ మేకింగ్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

ఈ సినిమాలో కొత్తగా కనిపించడం కోసం .. ప్రేక్షకులను మెప్పించడం కోసం చరణ్ ఎంతగానో శ్రమిస్తున్నాడని అన్నారు. ఇక అరవింద్ స్వామి పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఈ నెలాఖరు వరకూ హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ కొనసాగుతుందనీ, వచ్చేనెలలో సాంగ్స్ ను చిత్రీకరించడం జరుగుతుందని అన్నారు. ఆగస్టు 15న ఫస్టులుక్ ను .. అక్టోబర్ లో సినిమాను రిలీజ్ చేయనున్నామని స్పష్టం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)