ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు శిరీష్ టైటిల్ సాంగ్ వినిపిస్తాడట!

Tue, Jul 19, 2016
'శ్రీరస్తు శుభమస్తు'లో లావణ్య త్రిపాఠి - అల్లు శిరీష్
'శ్రీరస్తు శుభమస్తు'లో లావణ్య త్రిపాఠి - అల్లు శిరీష్
యువ కథానాయకులతో పోటీ పడటానికి అల్లు శిరీష్ మరోసారి రెడీ అవుతున్నాడు. ఈ సారి ఆయన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, లావణ్య త్రిపాఠి కథానాయికగా అలరించనుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా 'టైటిల్ సాంగ్' ను రేపు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి కూడా అల్లు శిరీష్ ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన 'శ్రీరస్తు శుభమస్తు' చేశాడు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ఆగస్టు 5న తెలుస్తుంది .. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఆ రోజునే మరి.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)