ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ కి మరోసారి దేవిశ్రీ మ్యూజిక్!

Tue, Jul 19, 2016
దేవిశ్రీ
దేవిశ్రీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరోసారి జతకడుతున్నాడు. గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ చిత్రాలకు ('నాన్నకు ప్రేమతో..' 'జనతా గ్యారేజ్') వరుసగా మ్యూజిక్ ఇస్తున్న దేవిశ్రీ, ఇప్పుడు మరో చిత్రానికి కూడా పనిచేయనున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి మనకు తెలిసిందే. నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించే ఈ భారీ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆగస్టులో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ కన్ఫర్మ్ అయినట్టు తాజా సమాచారం. దీంతో ఎన్టీఆర్ తో ఆయన హ్యాట్రిక్ కొడతాడని భావించవచ్చు. మాస్ ని ఉర్రూతలూగించే ట్యూన్స్ తో పాటు, మెలోడీస్ ని కూడా అదే స్థాయిలో ఇవ్వగల సంగీత దర్శకుడిగా దేవిశ్రీ పేరు తెచ్చుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)