ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నెగెటివ్ రోల్ అయినా నచ్చితే ఓకేనట!

Mon, Jul 18, 2016
శ్రీకాంత్
శ్రీకాంత్
శ్రీకాంత్ కథానాయకుడిగా కరణం బాబ్జీ తెరకెక్కించిన 'మెంటల్ పోలీస్' చిత్రం, 'మెంటల్'గా పేరు మార్చుకుని వచ్చేనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ సినిమా టీమ్, ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రతి పోలీస్ గర్వపడేలా ఈ సినిమా వుంటుందని చెప్పాడు.

కథా పరంగా .. పాత్ర పరంగా ఈ సినిమా తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు. ఇక తాను నెగిటివ్ రోల్స్ చేయనున్నట్టుగా ఈ మధ్య వస్తోన్న వార్తలను గురించి ఆయన ప్రస్తావించాడు. నెగెటివ్ రోల్స్ చేయమని ఇంతవరకూ తనని ఎవరూ అడగలేదని చెప్పాడు. భవిష్యత్తులో ఎవరైనా అడిగితే .. తనకి నచ్చితే తప్పకుండా చేస్తానని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)