ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అజిత్ సినిమాలో అక్షరహాసన్!

Mon, Jul 18, 2016
అక్షరహాసన్
అక్షరహాసన్
అజిత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. అజిత్ కెరియర్లో ఇది 57వ సినిమా. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను ఎంచుకున్నారు. ప్రత్యేకమైన ఓ పాత్ర కోసం అక్షరహాసన్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రత్యేకమైన ఓ పాత్ర ఉండటంతో .. ఎవరిని తీసుకుందామా అని బాగా ఆలోచించి, చివరికి అక్షరహాసన్ ను ఎంపిక చేశారని అంటున్నారు.

అక్షర హాసన్ ఒక వైపున దర్శకత్వంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తూనే, మరో వైపున నటిగా తనకి వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. 'శభాష్ నాయుడు' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న అక్షరహాసన్, తాజాగా అజిత్ సినిమాను అంగీకరించడం విశేషం. నటిగా అక్క శ్రుతిహాసన్ స్థాయికి చేరుకుంటుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)