ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ట్రెండ్ మార్చమంటున్న ముద్దుగుమ్మ

Mon, Jul 18, 2016
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి గ్లామరస్ రోల్స్ చేసి చేసి విసుగొచ్చినట్టుంది. అందుకే, ఇప్పుడు కాస్త ట్రెండ్ మార్చమని దర్శక నిర్మాతలను అడుగుతోంది. పైపెచ్చు, 'సూపర్ హీరో' (మానవాతీత శక్తులున్న కథానాయకుడు) తరహా కథల్లో నటించాలని వుందట. ఈ విషయాన్ని ఈమధ్య ఆమె తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేయడమే కాకుండా, వాటిపై ప్రస్తుతం డిస్కస్ కూడా చేస్తోందట.

అయితే, హీరోలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి కథలను రూపొందిస్తున్నారని, అలా కాకుండా తమలాంటి హీరోయిన్లను కూడా దృష్టిలో పెట్టుకుని తయారుచేయాలని కత్రినా అంటోంది. అలాంటి మంచి కథతో వస్తే చేస్తానని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రణభీర్ కపూర్ చేస్తున్న 'డ్రాగన్', టైగర్ ష్రాఫ్ నటిస్తున్న 'ఎ ఫ్లయింగ్ జాట్' చిత్రాలు ఈ తరహా కథా చిత్రాలే!
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)